Pushpa2 రేట్ల పెంపు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి
Pushpa2 రేట్ల పెంపు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి Pushpa 2 Ticket Rates: పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప1 ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా వస్తుందే పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై హైప్స్ పెంచేలా కొత్త కొత్త రూల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా సినిమా టికెట్ల ధరలపై ఉత్కంఠ నెలకొంది. ఇంతకీ సినిమా టికెట్ల ధరలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో? మూవీ మేకర్ల ప్రతిపాదనను ఏపీ సర్కార్ ఆమోదిస్తుందా అనేది చర్చనీయంగా మారింది.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. పుష్ప 2 లోని స్పెషల్ సాంగ్ ఎక్కడలేని రెస్పాన్స్ రావడంతో మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. అయితే టికెట్ల ధరలు పెరుగుతాయని చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. పుష్ప 2 కోసం మల్టీప్లెక్స్ లో నే కాకుండా సింగిల్ స్క్రీన్ లలో కూడా టికెట్లు ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం భారీ భారీ బడ్జెట్ సినిమాలు విడుదల అవుతున్న నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా ప్రభుత్వాలు కూడా అనుమతిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 1 విడుదల సమయంలో ఏపీలో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండడంతో మూవీ మేకర్స్ కు నష్టం వాటిల్లింది. అయితే పుష్పటుకి అలాంటి విషయాలు జరగకుండా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టిక్కెట్లు ధరలు పెంచుకునేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అనుమతులు కోరినట్టు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పుష్ప 2 టికెట్ల రేట్లను పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇన్ పుట్ ప్రకారం.. పుష్ప 2 (Pushpa2 TheRule )కి ఏపీలో మొదటి రోజు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో రూ.265 నుంచి రూ.324 పెంచేందుకు అనుమతి కోరగా.. అలాగే మల్టీ ప్లెక్స్‌ల్లో రూ. 354 నుంచి రూ.380 వరకు పెంచే విధంగా అనుమతులు ఇవ్వాలని మూవీ మేకర్స్ కోరినట్టు సమాచారం. ఈ ధరలు కనీసం మొదటి రోజు వరకు లేదా 7 నుంచి 11 రోజుల వరకు వసూళ్లు చేసే విధంగా ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్టు తెలుస్తోంది.
ఇన్ పుట్స్ ప్రకారం.. పుష్ప 2 మూవీ మేకర్స్ ప్రతిపాదన ఏపీ సర్కార్ దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. వారి ప్రతిపాదనలకు ఏపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించేనా? పవన్ కళ్యాణ్ ఏం అడ్డు చెబుతారనే అనుమానాలు అల్లు అభిమానుల్లో మొదలయ్యాయి. ఈ మూవీ మేకర్స్ ప్రతిపాదనపై ఏపీ సర్కార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా భారీ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకొని అవకాశం కల్పిస్తుండడంతో పుష్ప 2 కూడా రేట్లు పెంచుకునే అవకాశం లేకపోలేదు అంటూ మూవీ ట్రేడర్స్ అంచనా వేస్తున్నారు.
మరోవైపు.. పుష్ప 2 ఫస్ట్ షో టికెట్ ను వేలం పద్ధతిలో అమ్మబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. పుష్ప ఓపెనింగ్స్ రోజే బాక్సాఫీస్లో కలెక్షన్ల సునామి రాకమానదు. దాదాపు రూ. 1500 కోట్ల కలెక్షన్లు రాబడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి డిసెంబర్ 5 నుండి పుష్ప రాజ్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రూలింగ్ చేస్తాడు వేచి చూడాలి.