Prabhas రాజాసాబ్ ఫుల్ స్టోరీ లీక్ వింటుంటే వణుకు పుడుతుంది
Prabhas రాజాసాబ్ ఫుల్ స్టోరీ లీక్ వింటుంటే వణుకు పుడుతుంది ప్రభాస్ నుంచి రానున్న తాజా మూవీ రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి ఇటీవల మోషన్ పోస్టర్ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ప్రభాస్‌ని ముసలిరాజు గెటప్‌లో చూసి ఫ్యాన్స్ ఎక్సైట్ అవుతున్నారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో ప్రభాస్ దెయ్యం క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు మోషన్ పాస్టర్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. హారర్ జోనర్లో ప్రభాస్ నటించిడమే ఓ ట్విస్ట్ అంటే.. దెయ్యం పాత్రలో ప్రభాస్ కనిపించడం మరింత బిగ్ ట్విస్ట్. ఇక మారుతి హారర్ జానర్ సినిమాలను కొత్త కోణంలో తెరకెక్కించడంలో దిట్ట. వాస్తవానికి హారర్ కామెడీని టాలీవుడ్‌కు పరిచయం చేసింది మారుతి.
ఆయన కదా అందించిన ప్రేమ కథ చిత్రం మూవీ అప్పట్లో ఎంత సక్సస్ అ్దుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత హారర్ సినిమాల ట్రెండ్ ఊపు అందుకుంది. ఇక రాజ్యసభతో ఇప్పటివరకు ఎవరు చూడని తాజా హారర్ జానర్‌ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడట మారుతి. ఈ క్రమంలోనే స్టోరీ లైన్ ఇదే అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరిలాగానే సాధారణమైన జీవితాన్ని గడిపే కుర్రాడు(హీరో).. ధనవంతుడుగా బతకాలి.. రాజా లాగా జీవించాలని కలలు కంటూ ఉంటాడు. అలా బతికేందుకే ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే ఆ కుర్రాడికి తన తాత గారికి సంబంధించిన ఆస్తులు సొంత ఊర్లో ఉన్నాయని తెలిసి అక్కడికి అడుగు పెడతాడు. తన తాత నివసించే రాజమహల్ లాంటి ఇల్లు, అలాగే ఆయన దాచిపెట్టిన నగలు, డబ్బులతో కూడిన చాలా నిధి ఉందని తెలిసి ఆస్తి మొత్తాని దక్కించుకోవాలని అక్కడికి వెళ్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత తన తాత ఆత్మ.. అదే ఇంట్లో తిరుగుతూ రాత్రిళ్ళు పియానో వాయిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తన వారసుడు కాకుండా.. వేరే వాళ్ళను ఆత్మ చంపేస్తూ ఉంటుంది. ఇంతకీ రాజాసాబ్ ఆత్మ మంచిదా..? చెడ్డదా..? ఎందుకు తన వారసుడిని తప్ప ఇంట్లోకి ఎవరిని అడుగు పెట్టనివ్వదు..? అమాయకులను రాజాసాబ్ చంపేస్తాడా..? లేదా? అసలు రాజాసాబ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? తన వంశంలో వారసుడు తప్ప.. అందరూ ఎందుకు చనిపోయారు అనేదే కథ అట. ఇక మూవీ స్క్రీన్ ప్లే అంతా ఓ పక్కన ఆడియన్స్ వణికిస్తూనే.. మరోపక్క కడుపుబ్బ నవ్విస్తుందని టాక్. ఇటీవల కాలంలో ఇలాంటి భయంకర.. హారర్ థ్రిలర్ స్టోరీ సినిమాలు రాలేదని చెబుతున్నారు. మరీ రాజాసాబ్ నిజంగా ఆ రేంజ్లో ప్రేక్షకులను భయపెడుతుందో.. లేదో.. తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.
మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి