Kanguva Movie Review కoగువ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Kanguva Movie Review కoగువ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: శివ
ఎడిటర్: నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
యాక్షన్: సుప్రీమ్ సుందర్
డైలాగ్స్: మదన్ కార్కే
కథ: శివ, ఆది నారాయణ
పాటలు: వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్: అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్: రాజన్
కొరియోగ్రఫీ: శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏ జే రాజాఇ
కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్: 2024-11-14
ఫ్రాన్సిస్ (సూర్య) బౌంటీ హంటర్ (కిరాయికి ఏపనైనా చేసేవాడు). మరో బౌంటీ హంటర్ ఎంజెల్ (దిశా పటానీ)తో బ్రేకప్ జరుగుతుంది. అయితే డబ్బు కోసం తాము ఒప్పుకొన్న పనులు చేసే క్రమంలో ఇద్దరు గొడవ పడుతుంటారు. అలాంటి సమయంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జెటా అనే అబ్బాయిని ఫ్రాన్సిస్ కలుస్తాడు. అయితే జెటాను ఓ ముఠా సభ్యులు వెంటాడుతుంటాడు. అయితే జెటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటాడు. అయితే ఫ్రాన్సిస్‌ను మాత్రం ఆరాధ్యపూర్వకంగా చూస్తుంటాడు.
ఫ్రాన్సిస్‌కు జెటాకు ఉన్న పునర్జన్మ బంధం ఏమిటి? ఎలాంటి బంధం లేకున్నా ఫ్రాన్సిస్ ఎందుకు జెటాను కాపాడలని అనుకొంటారు. అయితే ఎంతకు కంగువ ఎవరు? జెటాకు కంగువకు ఉన్న రిలేషన్ ఏమిటి? ప్రణవాది కోన, కపాల కోన, అరణ్య కోన, హిమ కోన, సాగర కోన మధ్య జాతి పోరాటం ఏమిటి? ప్రణవాది కోనకు చెందిన కంగువాకు కపాల కోనకు చెందిన రుధిర నేత్ర (బాబీ డియోల్) వైరం ఏమిటి? ఐదు కోనల మధ్య రుమేనియా ఎందుకు చిచ్చు పెట్టానుకొన్నది. కంగువకు రుధిర వర్గాల జాతి, ప్రాంత ఆధిపత్య పోరాటం ఎందుకు వచ్చింది? కపాల కోన జాతిపై కంగువ ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నాడు? పులమాను కంగువ ఎందుకు ప్రాణాలకు తెగించి రక్షించాలని అనుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కంగువ సినిమా కథ.
కంగువ సినిమా ప్రస్తుతం కాలమానంలో ఫ్రాన్సిస్.. 1070 సంవత్సరంలో కంగువ పోరాటం నేపథ్యంగా సమాంతరంగా కథ నడుస్తుంటుంది. దర్శకుడు కథకు మంచి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకొన్నాడు. కానీ పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు ఈ జనరేషన్ ఆడియెన్స్ నచ్చే విధంగా సులభంగా అర్దమయ్యేలా, సరళీకృతంగా స్టోరీ నేరేషన్ చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక మితీమీరిన యాక్షన్, అరిచి గోల పెట్టే డైలాగ్స్ కొంత వరకు భరించవచ్చేమో కానీ.. సినిమా మొదలైన తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు అదే విధంగా ఉండటం భరించలేని విషయం. అయితే సూర్య, బాబీ డియోల్ పాత్రల వరకు ఓకేలా ఉంటాయి. మరో పాత్ర ఈ కథలో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా కనిపించకపోవడం మైనస్‌గా మారింది.
ఇక నటీనటలు విషయానికి వస్తే.. సూర్య ఎప్పటిలానే తన నటన, ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఫ్రాన్సిస్, కంగువగా ఈ సినిమాలో రెండు పాత్రల్లో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు, ఎమోషన్ సీన్లను బాగా పండించాడు. ఇక దిశా పటానీ కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. బాబీ డియోల్ మరోసారి క్రూరమైన విలన్‌గా ఆకట్టుకొన్నాడు. అంతా సూర్యనే ఉండటం వల్ల ఆ షాడోలో బాబీ డియోల్ క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ కాలేకపోయిందనిపిస్తుంది. ఇద్దరు బాలనటులు కథకు బలమైన పాత్రలుగా నిలిచాయి. మిగితా పాత్రల్లో నటించిన వారాంత ఫర్వాలేదనిపించారు.
కంగువ సినిమాకు అత్యంత బలం సాంకేతిక నిపుణుల పనితీరు. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు దేవీ శ్రీ ప్రసాద్ సన్నివేశాలకు అవసరానికి మించి మోత మోగించాడని చెప్పవచ్చు. పళనిస్వామి సినిమాటోగ్రఫి ఈ సినిమాను మరింత రిచ్‌గా మార్చింది. అందమైన లోకేషన్లు ఈ సినిమాను అందంగా మార్చింది. అయితే ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఇంకా స్కోప్ ఉందనిపిస్తుంది. జ్ఞానవేల్ రాజా నిర్మాణ సారథ్యంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
సూర్య, బాబీ డియోల్, సాంకేతిక విభాగాల పనితీరు, దర్శకుడు శివ టేకింగ్ బలంగా మారిన చిత్రం కంగువ. జాతి, ప్రాంతాల మధ్య ఆధిపత్య పోరాటం కథగా ఈ సినిమాను బడ్జెట్‌తో గ్రాండ్‌గా తీశారు. కానీ సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్. అయితే బీ, సీ సెంటర్ల ప్రేక్షకులను ఆకట్టుకొనే యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి. భారీ అంచనాలతో వెళితే కొంత నిరాశ చెందవచ్చు. సూర్య,బాబీ డియోల్ అభిమానులకు నచ్చే అవకాశం ఉంది. ఓ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పొందాలనుకొనే వాళ్లు ఈ వారం ఈ మూవీని ఎంచుకోవచ్చు.
Rajababu A Filmibeat
source: filmibeat.com
1 thought on “Kanguva Movie Review కoగువ మూవీ రివ్యూ అండ్ రేటింగ్”