Israel దేశంలో యుద్ధం దేనికోసం జరుగుతుందో తెలుసా
Israel దేశంలో యుద్ధం దేనికోసం జరుగుతుందో తెలుసా ఈ విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి కొంతమంది అయితే ఇజ్రాయిల్ది తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు ముస్లింల భూమి ఆక్రమించిందని అందుకు వాళ్లు యుద్ధం చేస్తున్నారని అంటారు కానీ ఇది ఎంతవరకు నిజం.
ఇజ్రాయిల్ యొక్క పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రపంచ గ్రంథ మైనటువంటి ఒక్క బైబిల్ లో మాత్రమే వారి యొక్క పురాతనమైన చరిత్ర కలిగి ఉంటుంది అసలు ఎందుకు ముస్లింలకు ఇశ్రాయేలు వారికి తరచుగా యుద్ధాలు జరుగుతున్నాయి ఇది గత కొన్ని సంవత్సరాలు నుంచి జరుగుతున్న యుద్ధం కాదు దాదాపు 3000 సంవత్సరాల నుండి జరుగుతున్న యుద్ధం ఎందుకు దేనికోసం యుద్ధం జరుగుతుందో పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం
అసలు ఇశ్రాయేలు జాతికి మూల పురుషుడు ఎవరు
ఇశ్రాయేలు జాతి యొక్క మూల పురుషుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే బైబిల్ చదివిన వారై ఉండాలి బైబిల్ చదివిన వారికి మూల పురుషుడు ఎవరో తెలిసిపోతుంది తెలియని వారికి నేను చెప్పేది ఏమిటంటే బైబిల్ గ్రంధంలో ఆదికాండము 12వ అధ్యాయము నుండి మొదలవుతుంది అతని చరిత్ర అతను ఎవరో కాదు అతని పేరు అబ్రహాము అతను ఇరాక్ ప్రాంతంలో జన్మించినవాడై విగ్రహాలు తయారు చేసుకొని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు
అతనికి ఒకరోజు కలలో దేవుడు ప్రత్యక్షమై నీవు నీ బంధువుల యొద్ద నుండి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు తెల్లవారిన తర్వాత దేవుడు చెప్పిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క బంధువుల యొద్ద నుండి తనకు కలిగిన ఆస్తి మొత్తాన్ని తీసుకొని దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళిపోతాడు
అదే ఈరోజు మనము చెప్పుకుంటున్న ఇశ్రాయేలీయుల దేశం దానికి పాత పేరు కనాను ఆ దేశానికి వెళ్లిన తర్వాత దేవుడు మరల కలలో ప్రత్యక్షమై నీకు మీ సంతానంనకు ఈ దేశాన్ని నేను ఇస్తున్నాను మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ దేశమును స్వాధీనపరచుకొనుడని సెలవిచ్చాను అలా దేవుడు చెప్పిన ఆ మాట విని ఆ దేశంలో నివసించుచుండెను
కానీ కొన్ని దినములైన తర్వాత ఆ దేశంలో కరువు రాగా కరువు నుంచి తప్పించుకొనుటకు పక్కనున్న ఈజిప్ట్ దేశానికి వెళ్ళిపోతాడు తర్వాత కొన్ని రోజులకు కరువు తీరిపోయినక మళ్ళీ కానాను దేశానికి వస్తాడు అలా వచ్చేటప్పుడు కొంతమంది పని వారిని కూడా తీసుకొని వస్తాడు
ముస్లింలకు మూల పురుషుడు ఎవరు
అలా వచ్చిన తర్వాత వారు ఆ దేశంలోనే నివసిస్తారు వారికి అప్పట్లో ఆస్తులు ఎక్కువగా ఉండేవి అనగా అప్పటి కాలంలో ఆస్తులు అంటే గొర్రెలు మేకలు, పశువులు ఒంటెలు గాడిదలు ఇవే వారి యొక్క ఆస్తులు వాటిల్ని చూచుకొనుటకు కొంతమంది పని వారిని తీసుకొని వస్తాడు అలా అతనికి ఎంత ఆస్తి ఉన్నా కానీ పిల్లలు అనే వారు ఎవరూ లేరు ఆ విషయమై ఎంతో వేదన పడుతూ బాధపడుతూ ఉంటాడు
అలా ఒకరోజు దేవుడు కలలో ప్రత్యక్షమై నేను నీకు పిల్లలను ఇస్తాను నీ గర్భఫలములో నుంచి వచ్చిన వారే నీకు వారసులు అవుతారు అని దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు కానీ అబ్రహాము భార్య అయినటువంటి శారయి దేవుడు మాటల మీద నమ్మకం లేక నవ్వుకుంటాది.
ఎందుకంటే అప్పటికి అబ్రహం వయసు 84 సంవత్సరములు ఉంటాయి తర్వాత కొన్ని రోజులకు అతని భార్య అయినటువంటి శారయి నా కింద ఎంతోమంది పని మనుషులు ఉన్నారు కదా అందులో ఒక ఆమెను గర్భవతిని చేసి ఆమె ద్వారా నాకు సంతానం ఇవ్వమని అడుగుతాది
ఆమె చెప్పిన మాట విని ఆమె పని మనుషుల్లో ఒక ఆమె అయినటువంటి హాగరును ఎంచుకొని ఆమె తోటి కాపురం చేయటం వలన అతనికి ఒక కుమారుడు పుడతాడు అతని పేరు ఇస్మాయిల్ అతనే ఈ ముస్లిం సమాజానికి మూల పురుషుడు
అబ్రహాము ఎందుకు ఇస్మాయిల్ పంపించి వేస్తాడు
కానీ దేవుడు నీ సొంత భార్యకు పుట్టిన వాళ్లకి మాత్రమే ఈ కానాను దేశాన్ని ఇస్తాను అని చెప్తాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతని భార్య కూడా ఒక కుమారుడు పుడతాడు అతని పేరు ఇస్సాకు అలా అందరూ కలిసి ఒక చోటే ఉంటూ ఇద్దరు పిల్లలు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటారు
అలా కొన్ని రోజులకు పిల్లలు ఇద్దరు వాదనలు పెట్టుకొని చిన్న వయసులోనే గొడవలు పడుతుండటం చూసి అతని భార్యలు ఇద్దరు గొడవలు పెట్టుకుని అతను రెండో భార్య అయినటువంటి హాగరును అతని పిల్లవాడిని వారి నుంచి దూరముగా పంపించి వేస్తాడు
అలా వారు వెళ్ళిపోయి పక్కన వేరొక దేశంలో కాపురం ఉంటారు పెళ్లి వయసు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అయినటువంటి హాగరు అతనికి తాను పుట్టి పెరిగిన ఈజిప్టు దేశం నుంచి ఒక అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తుంది. అలా వారి సంతానం అభివృద్ధి అవుతూ వస్తూ ఉంటుంది
అబ్రహాముకు ఎంతమంది పిల్లలు పుడతారు
ఇక్కడ అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా తిరిగి పెద్దవాడై పెళ్లి ఈడుకొచ్చినప్పుడు అతని తండ్రి అతనికి పెళ్లి చేస్తాడు అతనికి ఇద్దరు కుమారులు పుడతారు ఒక అతని పేరు ఏసావు రెండవ కుమారుని పేరు యాకోబు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత యాకోబు కూడా పెద్దవాడై పెళ్లి చేసుకుంటాడు అతనికి నలుగురు భార్యలు ఉంటారు
ఆ నలుగురికి కలిపి 12 మంది కుమారులు పుడతారు తరువాత కొన్ని రోజులకు కలలో దేవుడు ప్రత్యక్షమై నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను నేనే నిశ్చయముగా నీ సంతానానికి ఈ దేశమును ఇస్తానని వాగ్దానం చేస్తాడు అలా కొంతకాలానికి అతని పేరును కూడా దేవుడు మారుస్తాడు ఇకనుండి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయిల్ అని మారుస్తాడు అలా అతనికి పుట్టిన సంతానాన్ని ఇస్రాయేలీయులు అని అంటారు
ఇశ్రాయేలీయులు ఈజిప్టు దేశానికి ఎందుకు వెళ్లారు
అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత వారికి పుట్టిన 12 మంది కుమారులు పెద్ద వారై పెళ్లిళ్లు చేసుకుంటారు అలా వారికి కూడా సంతానం వస్తుంది అప్పుడు వారి సంతానం మొత్తం 70 మంది అప్పుడు ఆ దేశంలో పెద్ద కరువు వస్తుంది ఆ కరువు నుండి తప్పించుకోవటానికి ఈజిప్టు దేశానికి వలస వెళ్లిపోతారు అలా అక్కడికి వెళ్లిన 70 మంది అక్కడే ఉండిపోతారు కొంతకాలానికి అక్కడ రాజు వీరిని బానిసలుగా మార్చుకుంటాడు
ఎన్ని సంవత్సరములు బానిసత్వంలో ఉంటారు
అలా 430 సంవత్సరములు బానిసత్వంలో ఉంటారు వారి సంతానం అప్పుడు లక్షల్లో ఉంటుంది అందులో భక్తి గలవారు దేవునికి ప్రార్థన చేస్తారు నీవు మాకు ఇచ్చిన దేశానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు మేము అప్పుడు కరువులో ఇక్కడికి వచ్చి బానిసరం అయిపోయాము మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి విడిపించి నువ్వు చెప్పిన ఆ కానాను దేశానికి తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేస్తారు
వారి బానిసత్వం నుంచి ఎలా విడిపింపబడతారు
వారి ప్రార్థనలు విన్న దేవుడు వారిలో మోషే అనే ఒక నాయకుడి పుట్టించి అతని ద్వారా ఆ లక్షల మంది ఉన్న ఇశ్రాయేలీయుల జనాభాన్ని తీసుకొని కానాను దేశానికి వస్తాడు అలా వచ్చే దారిలో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఈ ఆజ్ఞలు చొప్పున మీరు పాటిస్తే నేను మీకు తోడై ఉండి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని చెబుతాడు వీళ్లు వచ్చేసరికి ఆ కానాను దేశాన్ని చుట్టుపక్కల ఉన్న రాజులు ఆక్రమించుకొని నివాసం ఉంటూ ఉంటారు
ఏ రాజు కాలంలో బంగారు దేవాలయం కడతారు
అప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళ అందరిని తరిమేసి కొంతమందిని చంపేసి వారి దేశాన్ని వారు స్వాధీనం చేసుకుంటారు అలా కొన్ని సంవత్సరములు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు కూడా ఒక సొంత రాజుని ఏర్పాటు చేసుకుంటారు అతని పేరు సౌలు ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ఇతనే ఇతని తరువాత దావీదు ఇశ్రాయేలీయులకు రాజు అవుతాడు దావీదు తర్వాత అతని కుమారుడు సొలోమోను రాజు అవుతాడు ఈ రాజు కాలంలో ఆ దేశంలో బంగారు దేవాలయం ఒకటి కడతారు
దేవుడికి ప్రార్ధనలు చేయడానికి ఇప్పుడు జరిగే గొడవలు అన్నీ ఆ దేవాలయం గురించి అది అలానో ముందు ముందు తెలుసుకోండి అలా కొంతకాలానికి సొలోమోను రాజు మరణించిన తర్వాత ఇశ్రాయేలీయుల దేశం అనేది రెండు ముక్కలు అవుతుంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలా అయితే విడిపోయాయో అలాగనే అప్పుడు ఇజ్రాయిల్ యూదా రెండుగా విడిపోతాయి
ఇశ్రాయేలు 20 మంది రాజులు పరిపాలిస్తారు అలాగే యూదా అని కూడా 19 మంది రాజులు పరిపాలిస్తారు దేవుని ఆజ్ఞలు పాటించినంత కాలం ఆయా దేశాలు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే ఆజ్ఞలను విడిచి పెట్టి పాటించకుండా ఉంటారో అప్పుడు దేవుడు వారిని శిక్షలు విధించేవాడు
అలా కొంతకాలానికి వారు దేవుని ఆజ్ఞలను పూర్తిగా మర్చిపోతారు అప్పుడు దేవుడు వారిని వేరే దేశం యొక్క రాజులకు అప్పగిస్తాడు ఇశ్రాయేలు వారిని అశ్శూరు రాజు చెర తీసుకొని పోతాడు యూదా వారిని బబులోను రాజు చెర తీసుకొని పోతాడు పోతూ పోతూ బంగారు దేవాలయంలో ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకొని దేవాలయం పడగొట్టి వెళతాడు
యోధ వారు 70 సంవత్సరములు బబులోను రాజు యొక్క చెరలో ఉంటారు 70 సంవత్సరము పూర్తి అయిన తర్వాత వారిని విడిచి పెడతాడు అప్పుడు వారు వచ్చి ఆ దేశమును బాగు చేసుకుని దేవాలయం మరలా కట్టుకుంటారు అసురు రాజు చెరకుపోయిన వారు మరలా రారు కేవలం యోధ వారు మాత్రమే వస్తారు అలా వచ్చినవారు కొంత కాలానికి వారి సంతానం మళ్ళీ అభివృద్ధి అయ్యి విస్తరిస్తారు
ఆ యూదా జాతి లో నుంచే ఏసుక్రీస్తు పుడతాడు ఆ జాతిలో వారికి ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు చేసి చూపిస్తాడు కానీ వారు ఏసుక్రీస్తును నమ్మరు అలా వారు కొంతకాలానికి ఏసుక్రీస్తుకు శిలువ వేయించి మరి చంపేస్తారు తర్వాత మరణాన్ని జయించి దేవుని వద్దకు వెళ్ళిపోతాడు అలా ఏసుక్రీస్తు వెళ్లిపోయిన 40 సంవత్సరములకు రోమా ప్రభుత్వం ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసి ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసి ఆ దేశంలో ఉన్న యూదులను వేరే దేశాలకు అమ్మివేసి కొంతమందిని బానిసలుగా చేసుకుంటారు
అలా యూదులు ప్రపంచ దేశాలకు చెదిరిపోతారు తర్వాత వీరు దేశాన్ని చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాల వారు ఆక్రమించుకుంటారు అలా వారు ఆక్రమించుకున్నాక సొలోమోను రాజు కట్టించిన దేవాలయం స్థానంలో వాళ్లు ఒక మసీదు కట్టుకుంటారు దాని పేరే అల్ అక్సా మసీదు అండ్ ధూమ్ ఆఫ్ ది రాక్ దాని గురించి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి
కొంతకాలానికి బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రిటిష్ ప్రభుత్వం తమ ఆధీనంలోకి ఇస్రాయేలు దేశాన్ని తీసుకుంటారు అప్పటినుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఇజ్రాయిల్ దేశం ఉంటుంది 19వ శతాబ్దంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది కదా అప్పుడు ప్రపంచంలోనే భయంకరమైన యుద్ధం జరుగుతుంది
ప్రపంచ దేశాలు రెండు బ్యాచ్లుగా విడిపోయి యుద్ధం చేసుకుంటాయి తర్వాత కొన్ని రోజులకు యుద్ధం ముగుస్తుంది ఒక 20 సంవత్సరములు నానాజాతి సమితి అనేది ఏర్పాటు చేసి ప్రపంచాన్ని శాంతిపరచాలని చెప్పి చూస్తారు కానీ తర్వాత వెంటనే రెండో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది
ఈ యుద్ధం కూడా గోరాతి ఘోరంగా జరుగుతుంది కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు కానీ యుద్ధం ఆగదు అప్పుడు రష్యా దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుడైనటువంటి ఒక శాస్త్రవేత్త అను బాంబు కనుక్కొని తయారుచేసి అమెరికా వాడికి ఇస్తాడు అప్పుడు వారు జపాన్ మీద వేస్తారు ఆ దెబ్బ తోటి రెండో ప్రపంచ యుద్ధం అనేది ఆగిపోతుంది
ఆ తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన విజయానికి కారణమైనది అతన్ని పిలిపించి నీకేం కావాలో కోరుకోమని అడిగినప్పుడు అతను నేను ఒక ఇస్రాయేలీయుడిని నాకు మా వారికి ఉండటానికి సొంత దేశం కావాలి అని మా దేశాన్ని మాకు ఇప్పించమని అడుగుతాడు అప్పుడు ప్రపంచంలో ఉన్న పెద్ద నాయకులందరూ ఆలోచన చేసి ఇస్రాయేలు దేశాన్ని స్వతంత్రంగా ప్రకటిస్తారు
ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా ఇజ్రాయిల్ అందరూ తమ సొంత దేశానికి రావాలని ఆహ్వానం పంపిస్తారు అలా 1948లో ఇస్రాయేలు దేశంగా ఏర్పడింది ఆనాడు కాలంలో వారి ఇతరులకు దేవుడు ఇచ్చిన ఒక గ్రంథంలో ఆ దేశం యొక్క సరిహద్దులు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని వేరే వారు ఆక్రమించుకొని ఉండటం వలన ఇది మా దేశం మాకు ఇవ్వమని యుద్ధాలు జరుగుతున్నాయి
అలాగే వారు కట్టుకున్న దేవాలయం స్థానంలో మసీదును కూడా తీసివేయాలని ఆజ్ఞ జారీ చేశారు కానీ ముస్లిమ్స్ వారు దానికి ఒప్పుకోలేదు అందువలన వారు ఇస్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు అలా అప్పటినుంచి ఇప్పటివరకు సరిహద్దు విషయంలోనూ దేవాలయం విషయంలోనూ ఎన్నో యుద్ధాలు జరుగుతూ వస్తున్నాయి ఇది ముందు ముందు ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో మనం వేచి చూడాల్సిందే ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలనుకుంటే బైబిల్ ని ఒకసారి పరిశీలించండి