Free Satilite Internet Providing Elan musk And Mukesh Ambani
అదే జరిగితే ఇండియాలో ఫ్రీ ఇంటర్నెట్
“””””””””””””””””””””””””””””””””””””””””””
Free Satilite Internet Providing Elan musk And Mukesh Ambani ఇండియాలో శాటిలైట్ ద్వారా ఫ్రీ ఇంటర్నెట్ అందించడానికి ప్రపంచ కుబేరులైన ముఖేష్ అంబానీ మరియు ఎలాన్ మస్క్ మధ్య పోటీ జరుగుతోంది. ముఖేష్ అంబానీ, జియో ద్వారా, ఇప్పటికే భారతదేశంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులను సంపాదించాడు. ఇప్పుడు, అతను సాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా మరింత విస్తరించాలనుకుంటున్నాడు.
ఇంకా ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ద్వారా, తక్కువ ఎత్తులో ఉన్న సాటిలైట్లను ఉపయోగించి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించాలనుకుంటున్నాడు. ఈ పోటీ ద్వారా, భారతదేశంలో వినియోగదారులకు మంచి సేవలు అందే అవకాశం ఉంది. అయితే వీరిద్దరూ ఇండియాలోని ప్రజలకు ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ఎందుకు పోటీ పడుతున్నారో క్లియర్ గా తెలుసుకుందాం.
ఇండియాలో ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ మరియు ఎలాన్ మస్క్ మధ్య పోటీ ఎందుకు జరుగుతోందంటే, ఇది ఒక పెద్ద వ్యాపార అవకాశంగా మారింది. ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జియో ఇప్పటికే భారతదేశంలో టెలికాం రంగంలో ప్రధాన స్థానాన్ని సంపాదించింది. ఇప్పుడు అతను సాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా మరింత విస్తరించాలనుకుంటున్నాడు.
టెస్లా, స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్, ట్విట్టర్ ఇలా వివిధ రంగాల్లో అనేక కంపెనీలు కలిగిన ఎలాన్ మస్క్ కూడా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం తన స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ద్వారా, ప్రపంచవ్యాప్తంగా సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించాలనుకుంటున్నాడు. అందులో భాగంగా ఇండియా వంటి పెద్ద మార్కెట్లో ప్రవేశించడం అతనికి చాలా ముఖ్యమైంది.
ఇక ఇటీవల ఇండియా ప్రభుత్వం సాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులో భారీ మార్పులు చేసింది. శాటిలైట్ స్పెక్ట్రమ్ సేవలను అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ద్వారా ఏదైనా కంపెనీకి అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే ఎలాన్ మస్క్ కు కలిసి వస్తోంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ టెలి కమ్యూనికేషన్స్ యూనియన్(ITU) అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ స్పెక్ట్రమ్ పనులు చేస్తుంది.
ఇప్పటికే ఈ సంస్థతో చాలా దేశాలు టై అప్ అయి ఉన్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. ఈ ITUతో ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కు మంచి రిలేషన్ ఉంది. అంటే ITU నిబంధనలు ఫాలో చేయగల కెపాసిటీ స్పేస్ ఎక్స్ కు మాత్రమే ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ మెథడ్ ద్వారా ఎలాన్ మస్క్ కు ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించే కాంట్రాక్ట్ ఇవ్వడానికే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ముఖేష్ అంబానీ మరియు ఎలాన్ మస్క్ ఇద్దరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు.
ఇక సెల్యులార్ టవర్లతో పోల్చుకుంటే సాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించవచ్చు.
ప్రస్తుతం ఇండియాలో టెలికాం సర్వీసులన్నీ టవర్లు,కేబుల్స్, బూస్టర్స్ సాయంతో పని చేస్తాయి. అయితే ఇవి నగరాల్లో తప్ప పల్లెలు, కొండప్రాంతాల్లో సరైన సేవలు అందించలేకపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా రానున్న టెలికాం సేవలు శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. అంటే భూమి ఉపరితలంపై శాటిలైట్స్ ఉంచి వాటి ద్వారా సేవలు అందిస్తారన్న మాట.
దీని వల్ల దట్టమైన అడవులు, పెద్ద పర్వతాలపై కూడా ఇంటర్నెట్, కాల్స్ సేవలు చాలా స్పష్టంగా వినియోగించుకోవచ్చు. ఇలా శాటిలైట్స్ ద్వారా సేవలందించడంలో ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ ఎప్పటి నుంచో సేవలందిస్తోంది. సుమారు 100 దేశాల్లో 6,419 ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.
ముఖేష్ అంబానీ టెలికాం రంగంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎయిర్‌వేవ్ వేలంలో బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టిన జియో ఇప్పుడు ప్రముఖ శాటిలైట్ ఆపరేటర్ అయిన లక్సెంబర్గ్‌కు చెందిన SES ఆస్ట్రాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ఎలాన్ మస్క్ స్టార్ లింక్ కంటే మెరుగైన సేవలు అందించనుంది.
అంటే భూమికి తక్కువ ఎత్తులోనే శాటిలైట్స్ ను ఉంచి ప్రజలకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. అందుకే ముఖేష్ అంబానీ ఇందులో పెట్టుబడులు పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతున్న అడ్మినిస్ట్రేటివ్ విధానం వల్ల ఎలాంటి వేలం లేకుండా కేవలం కంపెనీ శక్తి సామర్థ్యాలను పరిగణించి లైసెన్స్ ఇవ్వనున్నారు. ఇది జియోకు ఒకరకంగా పెద్ద నష్టం తెచ్చే విషయమనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు గనుక సక్సెస్ అయితే అతి త్వరలో భారతీయులందరూ శాటిలైట్ ద్వారా ఫ్రీగా ఇంటర్నెట్ పొందగలుగుతారు.