Donald Trump Life Story ఎవరి ట్రంప్ ఆయన కథ ఏమిటి
Donald Trump Life Story ఎవరి ట్రంప్ ఆయన కథ ఏమిటి డొనాల్డ్ జాన్ ట్రంప్.. ఉత్కంఠ భరితమైన ఎలక్షన్ పోరులో.. కఠినమైన సవాళ్లను ఎదుర్కొని, బలమైన ప్రత్యర్థిని చిత్తుచేసి విజేత. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచి, అగ్రరాజ్యం భవిష్యత్తును నిర్ణయించబోయే ప్రజానేత.
2024 U.S ఎలక్షన్స్లో.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ను చిత్తు చేసి అమెరికా గడ్డపై కొత్త చరిత్రను లికించాడు. అసలు ఎవరీ ట్రంప్..! ఏమిటి ఈయన కథ? రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయం వైపు తన ప్రయాణం ఎలా మొదలయ్యింది? అనే విషయానికొస్తే..
అసలు ఎవరీ ట్రంప్
బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు కదా.. డోనాల్డ్ జాన్ ట్రంప్ కూడా అచ్చం అలాంటి సంపన్న కుటుంబంలోనే జన్మించాడు. ఫ్రెడ్ ట్రంప్, మేరీల నాలుగో సంతానంగా 1946, జూన్ 14న న్యూయార్క్ శివారు క్వీన్స్ లో జన్మించాడు. ట్రంప్ తండ్రివి జర్మన్ మూలాలు, తల్లి పూర్వీకులది స్కాట్ లాండ్గా చెబుతుంటారు. ఏడెనిమిది తరాల కిందటే ట్రంప్ కుటుంబం అమెరికాకు వలసవచ్చింది.
ప్రెడ్ ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. కాలం క్రమంలో ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్’ స్థాపించి.. అమెరికాలోని దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.. న్యూయార్క్ లోనే పుట్టి పెరిగిన డోనాల్డ్ ట్రంప్.. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా అనుబంధ వార్టన్ స్కూల్ నుంచి 1968లో ఎకనామిక్ పట్టాపుచ్చుకున్నారు.
చిన్నప్పటినుంచే ట్రంప్లో తుంటరి వేషాలు, చురుకుదనం కాస్త ఎక్కువగానే ఉండేవి. యువకుడిగా ఉన్నప్ప్పుడే 1971 నాటికి తండ్రి స్థాపించిన సంస్థ పగ్గాలు చేపట్టాడు. అలా కంపెనీ పేరును ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా మార్చారు. ఆపై అతి తక్కువ సమయంలోనే తన కార్యాలయాన్ని న్యూయార్క్ వ్యాపార కేంద్రం మాన్ హట్టన్ కు మార్చేశారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. లెక్కకుమించి హోటళ్లు, క్యాసినో, భారీ టవర్లు, గోల్ఫ్ కోర్సులు నిర్మించారు. వాటితో ట్రంప్ అనే పేరును పెద్ద బ్రాండ్గా మార్చేశారు.
రియాలిటీ రంగంలో సక్సెస్ సాధించాక ట్రంప్ చూపు ఎంటర్ టైన్ మెంట్ రంగం వైపునకు మళ్లింది. టీవీ షోలు నిర్మించడమేకాక స్వయంగా ‘ది అప్రెంటిస్’ అనే కార్యక్రమానికి హోస్ట్ గానూ వ్యవహరించాడు. 2004-2015 మధ్య కాలంలో ఎన్ బీసీ చానెల్ లో ఈ కార్యక్రమం ప్రసారమైంది. డబ్బుతోపాటు పేరు కూడా సంపాదించిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్న ఆయన.. 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగారు.
2015 జూన్ లో ‘రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా పోటీని ప్రకటించారు. అరడజను మంది పోటీదారుల్లో ఒకడిగా ట్రంప్ ప్రస్థానం ప్రారంభమైంది. అమెరికా ఉద్యోగాలన్నీ అమెరికన్లకేనన్న ప్రకటనతో.. ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ముస్లింలపై, మహిళల అబార్షన్లపై, చైనీస్, ఇండియన్, మెక్సికన్లపై ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు మీడియా, ప్రజల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నాయి.
ట్రంప్ వ్యక్తిగత జీవితం మొత్తం వివాదాలతోనే ముడిపడి ఉంటుంది. 1977లో ఇవానా ట్రంప్ ను పెళ్లాడిన ట్రంప్.. 1991లో ఆమెకు విడాకులిచ్చారు. రెండేళ్లు గడిచాక మార్లా జెల్నికోవాను పెళ్లాడి 1999లో ఆమెకూ విడాకులిచ్చారు. తర్వాతి ఆరేళ్లూ ఒంటరిగా జీవితాన్ని గడిపిన ట్రంప్.. 2005లో మెలానియాను పెళ్లాడారు. ముగ్గురు భార్యలద్వారా ట్రంప్ కు కలిగిన సంతానం మొత్తం ఐదుగురు సంతానం. వారు డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్, టిప్పనీ, బరూన్ లు.
ప్రస్తుతం 90 కి పైగా క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నప్పటికీ, న్యాయపరమైన వ్యవహారాలను వాయిదా వేసుకుంటూ.. అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో పోటీని కొనసాగిస్తూ వచ్చారు. 2017 జనవరి 20న ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా వైట్ హౌస్ లో అడుగుపెట్టాడు. నిలకడలేని మనస్తత్వం కలవాడు, క్రిమినల్ మైండెడ్ ఫెలో అని నవ్వుకున్నా నోర్లకు మూత పడేలా చేసాడు.
2020 ఎన్నికల్లో ఓడిపోయాకా.. ట్రంప్ తన మద్దతుదారులను 2024 రేసుకు ఉత్సాహపరుస్తూ.. ఎన్నికలు చోరీ చేయబడ్డాయని ప్రస్తావించి, వాషింగ్టన్ లో జనవరి 6న జరిగిన అల్లర్లు రాష్ట్రీయ చర్చకు వేదికయ్యాయి. ఇటు 2024 ఎలక్షన్స్ లో, ఎన్నికల ప్రచార సమయంలో తనపై జరిగిన కాల్పులు.. ప్రజల్లో ట్రాంప్ పై సానుభూతిని పెంచాయి. అటు వ్యక్తిగతంగా, ఇటు రాజకీయంగా అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ.. 2024 U.S ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో తన విజయ దుందుభిని మోగించారు.