Whiskey Vodka Rum Wine Brandy Champagne మద్య తేడా ఏమిటో తెలుసా..?

Written by trendingspott.com

Published on:

Whiskey, Vodka, Rum, Wine, Brandy Champagne మద్య తేడా ఏంటిMind Blowing Facts In Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now
youtube channel Subscribe now

Whiskey Vodka Rum Wine Brandy Champagne మద్య తేడా ఏమిటో తెలుసా..?

Whiskey Vodka Rum Wine Brandy Champagne మద్య తేడా ఏమిటో తెలుసా..?మద్యం ఏదయినా మద్యమే కదా.. మరి వోడ్కా, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, బీరు, బ్రీజరు వీటి మధ్య తేడా ఏమిటో తెలుసా..?

మద్యం అనగానే మనకు గుర్తొచ్చేది వోడ్కా, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, బీరు, బ్రీజరు వంటి పానీయాలు. వీటన్నింటిలోనూ ఆల్కహాల్ ఉంటుంది, కానీ వాటి తయారీ విధానం, రుచి, వాసన, మరియు ఆల్కహాల్ శాతం వేర్వేరు.

(1) వోడ్కా:

ప్రధానంగా ధాన్యాలు లేదా బంగాళాదుంపల నుండి తయారవుతుంది. ఇది సాధారణంగా రుచి లేకుండా, సాఫ్ట్‌గా ఉంటుంది. ప్రాథమికంగా మంచినీరు, ఇథనాల్ కలిగి స్వేదనం చేయబడ్డ ఒక మత్తు పానీయం. సాంప్రదాయికంగా వోడ్కా తయారీలో పులియబెట్టిన తృణ ధాన్యాలను, బంగాళాదుంపలను వినియోగిస్తారు. అయితే ఆధునిక పద్ధతులలో తయారు చేయబడే వోడ్కాలో ఫలాలు కూడా వినియోగిస్తారు.వోడ్కా రష్యా మరియు తూర్పు యూరప్ దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.వోడ్కాలో ఆల్కహాల్ శాతం 40% కలిగి ఉంటుంది.

(2) బ్రాందీ:

పండ్ల రసాల నుండి తయారవుతుంది, ముఖ్యంగా ద్రాక్ష రసం నుండి. ఇది సాధారణంగా వయసు పెరిగినప్పుడు మరింత రుచికరంగా మారుతుంది. బ్రాందీని విందు సందర్భాల్లో ఎక్కువగా తాగుతారు.బ్రాండీ అనేది వైన్‌ను దిష్టిల్ చేసి తయారు చేసే మత్తు పదార్థం.
బ్రాండీలో సాధారణంగా 35–60% ఆల్కహాల్ వాల్యూమ్ (70–120 US proof) ఉంటుంది. బ్రాండీని సాధారణంగా భోజనం తర్వాత డిజెస్టిఫ్‌గా తాగుతారు.
కొన్ని బ్రాండీలను చెక్క బారల్‌లలో వయసు పెంచుతారు. బ్రాండీని తయారు చేయడం 1313 సుమారుగా ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది.
బ్రాండీని straw yellow నుండి dark tan వరకు, కూడా ఆకుపచ్చటి రంగులో కూడా కనిపించవచ్చు

Pushpa 2: The Rule ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే!
Pushpa 2: The Rule ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే!

(3)విస్కీ:

పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది.విస్కీని తయారు చేయడానికి, సాధారణంగా బార్లీ, రై, వెట్, లేదా మొక్కజొన్న వంటి శిశుపదార్థాలను ఉపయోగిస్తారు. విస్కీని వయసు పెరిగినప్పుడు, దాని రుచి మరింత మెరుగవుతుంది. విస్కీని స్కాచ్, బోర్బన్ వంటి రకాలుగా విభజిస్తారు, వీటిలో స్కాచ్ స్కాట్లాండ్‌లో మరియు బోర్బన్ అమెరికాలో తయారవుతుంది.విస్కీని సాధారణంగా 40% ABV (ఆల్కహాల్ బై వాల్యూమ్)తో తయారు చేస్తారు.విస్కీ తయారీలో, మెథనోల్ (methanol) లేదా మెథైల్ ఆల్కహాల్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

(4) రమ్:

పులియబెట్టిన చెరకు లేదా చెరకు రసాల నుండి తయారవుతుంది. ఇది సాధారణంగా తీపి రుచితో ఉంటుంది.చెరకు నుండి పులియబెట్టిన పానీయాలను వెలికితీయటం ప్రాచీన చైనా/భారతదేశంలో ఉంది. 17వ శతాబ్దంలో మొట్టమొదటి సారిగా రం కరేబియన్ దీవులలో స్వేదనం చేయబడ్డది. చక్కెరను శుద్ధి చేసే ప్రక్రియలో ఉపఫల్ంగా వచ్చే చెరకు మడ్డిని కిణ్వనం చేయటం వలన మద్యంగా మారుతుందని బానిసలు ఆ తర్వాత కనుగొన్నారు.

ఈ మద్యపాన ఉపఫలాలను స్వేదనం చేయటం ద్వారా వాటిలోని మాలిన్యాలను తొలగించవచ్చని కనుగొనటంతో స్వచ్ఛమైన రం ఉత్పత్తి అవ్వటం ప్రారంభమైనది. 16వ శతాబ్దం నాటికే రం ఉత్పత్తి బ్రెజిల్, స్వీడన్ లలో జరిగాయి అని ధ్రువీకరించటానికి ఆనవాళ్ళు ఉన్నాయి.అటు తర్వాతి కాలంలో రం సేవనం/ఉత్పత్తి ఉత్తర అమెరికాకు విస్తరించింది. నానాటికీ రం యొక్క డిమాండ్ పెరిగిపోతోండటంతో ఇక్కడ చెరకు పంట కోసం శ్రామికులు కావలసి వచ్చింది.

దీనితో ఆఫ్రికా, కరేబియన్, ఉత్తర అమెరికాల మధ్య త్రికోణ వర్తకం స్థాపించవలసిన అవసరం వచ్చింది. బానిస-చెరకు మడ్డి-రం ల మార్పిడి మూడు పూవులు-ఆరు కాయలుగా వర్థిల్లినది. 1764 లో చేయబడిన చక్కెర చట్టంతో ఈ వర్తకానికి అడ్డుకట్ట పడినది. ఇదే అమెరికా విప్లవానికి ఒక కారణంగా పేర్కొనవచ్చును. రమ్ ఎక్కువగా కరేబియన్ ల్యాటిన్ అమెరికాలలో రం అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది.

ఆస్ట్రియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజి, ఫిలిప్పీన్స్, భారతదేశం, రీయూనియన్ దీవి, మారిషస్, దక్షిణ ఆఫ్రికా, తైవాన్, థాయ్ లాండ్, జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా దేశాలు రం ఉత్పత్తి అత్యధికంగా కలిగి ఉన్నాయి.రం వివిధ శ్రేణులలో తయారు చేయబడుతుంది. తక్కువ శక్తి గల తేలికపాటి (Light) రాలు కాక్ టెయిల్ లలో వినియోగించబడగా, శక్తివంతమైన గోల్డెన్/డార్క్ రాలు యథాతథంగా సేవించటానికి, వంటకాలలో వినియోగించటానికి ఉత్పత్తి చేయబడిననూ, ప్రస్తుత కాలంలో ఇతరాలతో మిళితం చేసి సేవిస్తున్నారు. యథాతథంగా/కేవలం ఐసు ముక్కలతో సేవించటానికి ప్రీమియం రం కూడా ఉత్పత్తి చేయబడుతుంది.

Pushpa2 రేట్ల పెంపు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి
Pushpa2 రేట్ల పెంపు పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి

(5) జిన్:

జునిపెర్ బెర్రీల నుండి తయారవుతుంది. ఇది ప్రత్యేకమైన వాసన మరియు రుచితో ఉంటుంది. జిన్ టానిక్ వంటి మిక్సర్‌లతో కలిపి తాగడం సాధారణం.తయారీకి, agricultural origin నుంచి వచ్చిన neutral spirit-కి, అనుమతి పొందిన natural flavoring substances-ను కలుపుతారు. బాటిల్ చేసినప్పుడు, దాని తక్కువ తక్కువ అల్కహాలిక్ స్ట్రెంగ్త్ బై వాల్యూ (ABV) 37.5% ఉండాలి.

(6) బీరు:

పులియబెట్టిన ధాన్యాల నుండి తయారవుతుంది, కానీ ఇది తక్కువ ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది. బీరు రకరకాల రుచులు మరియు శైలుల్లో లభిస్తుంది, మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా 3rd అత్యంత ప్రాచుర్యం పొందిన మద్యం పానీయం.బీరు అతి పురాతన పానీయాలలో ఒకటి. బీరు గురించి లిఖితపూర్వకమైన ఆధారాలు క్రీ.పూ. 6000 సంవత్సరం నాటి పురాతన ఈజిప్టు, మెసపొటేమియా చరిత్రలలో లభ్యమవుతున్నాయి.

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం అంతర్జాతీయ బీరుదినోత్సవంగాజరుపబడుతుంది.బీరును తయారు చేయడానికి నీరు, హాప్స్, బార్లీ, మరియు యీస్ట్ వంటి పదార్థాలు ఉపయోగిస్తారు. యీస్ట్ ద్వారా చక్కెరను ఆల్కహాల్‌గా మారుస్తారు.ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ కూడా ఉత్పత్తి అవుతుంది.

బీరును తయారు చేయడానికి, పదార్థాలను నీటితో తొలగించి, హాప్స్‌తో మరిగించి, తర్వాత తయారు చేసిన పానీయానికి యీస్ట్‌ను జోడించి, పెరిగేలా చేస్తారు.బీరును తయారు చేయడానికి కావలసిన పదార్థాలను, వాటిని కలిపే విధానం, వాటి నాణ్యత వంటి అంశాల ఆధారంగా బీరుకు వేర్వేరు రుచులు వస్తాయి

(7) బ్రీజరు:

ఫ్లేవర్డ్ ఆల్కహాలిక్ పానీయం, ఇది సాధారణంగా తక్కువ ఆల్కహాల్ శాతం కలిగి ఉంటుంది. ఇది తీపి రుచితో, ఫ్రూటీ ఫ్లేవర్స్‌లో లభిస్తుంది.Bacardi Breezer అనేది Bacardi తయారు చేసే పండ్ల రుచి గల మత్తు పదార్థం. ఇది వివిధ పండ్ల రుచులలో లభిస్తుంది, వంటివి: లెమన్, పీచ్, లీచి, పినాపిల్, ఆపిల్, రూబీ గ్రేప్‌ఫ్రూట్, లైమ్, ఆరెంజ్, బ్లాక్‌బెర్రీ, వాటర్‌మెలోన్, క్రాన్‌బెర్రీ, కోకోనట్, రాస్‌బెర్రీ, బ్లూబెర్రీ, పొమెగ్రనేట్, స్ట్రాబెర్రీ, మరియు మ్యాంగో.

Pushpa Runtime:పుష్ప2 ఎన్ని గంటల సినిమా నో తెలుసా
Pushpa Runtime:పుష్ప2 ఎన్ని గంటల సినిమా నో తెలుసా

Breezer అనేది ఒక ఆల్కోపాప్, దీని బేస్‌లో సాధారణంగా తెల్ల రంగు రమ్ ఉంటుంది. దీనిని కార్బొనేటెడ్ చేసి, పండ్ల రుచులతో కలిపి, కృత్రిమంగా తీపి చేసి బాటిల్ చేస్తారు. 2002లో భారత్‌లో Breezerను లాంచ్ చేశారు. Breezerను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలు వీగన్‌కు అనుకూలంగా ఉంటాయి.

ఫేనీకరించగా వచ్చిన పానీయాలకి రకరకాల పేర్లు ఉన్నాయి. ద్రాక్ష రసం నుండి చేసిన దానిని ఇంగ్లీషులో వైన్ (wine) అంటారు. దీన్ని మనం కావలిస్తే, తెలుగులో, ద్రాక్ష సారా అనో, టూకీగా సారా అనో అనొచ్చు. బార్లీ, మొక్కజొన్న, మొదలైన ధాన్యాలని నానబెట్టి, మొలకలెత్తే సమయంలో ఫేనీకరిస్తే బీరు (beer) వస్తుంది.

ఆ వైను, బీరులలో ఎతల్ ఆల్కహాలు 10 నుండి 15 శాతం వరకు ఉండొచ్చు; మిగిలినదంతా నీళ్లే. ఈ పానీయాలని వేడి చేసి, బట్టీ పట్టి, నీళ్లని చాలమట్టుకి బయటకి వెళ్లగొడితే వీటిలోని ఆల్కహాలు శాతం పెరుగుతుంది. ఇలా రకరకాల బీరులని బట్టీ పట్టి రకరకాల పేర్లతో విష్కీని తయారు చేస్తారు. మొక్కజొన్న బీరు నుండి తయారు చేసిన విష్కీని బర్బన్ (bourbon) అంటారు. వైనుని బట్టీ పట్టి బ్రాందీ (brandy) తయారు చేస్తారు.

డచ్చి భాషలో “బ్రాందీ” అంటేనే “దిగమరిగించిన సారా” అని, “మాడబెట్టిన వైను” అని అర్థం. బార్లీ బీరుని అభిషవించగా విష్కీ (whishky) వస్తుంది. బ్రాందీ, విష్కీలలో ఆల్కహాలు శాతం 50 వరకు ఉండొచ్చు. ఫేనీకరించిన చెరకు రసం నుండి రమ్ము (rum) తయారు చేస్తారు. ఈ రమ్మునే సంస్కృతంలో మైరేయం అనీ, ఆసవం అనీ, సీధు అనీ మూడు పేర్లతో పిలుస్తారు.

ఈ మూడు పేర్లూ మూడు రకాల రమ్ములని సూచిస్తాయి. అసలు సంస్కృతంలో ఈ మాదక ద్రవ్యాలకి ఉన్నన్ని పేర్లు ఇంగ్లీషులో కూడా లేవేమో. ద్రాక్ష సారాని సంస్కృతంలో మార్ద్వీకం అంటారు. మధ్వాసవం, మాధవకం, మధు అన్నవి ఇప్ప పువ్వుతో చేసిన కల్లుకి పేర్లు.ఇంతవరకు రెండు రకాల మద్యపానీయాలు చూసేం. పులియబెట్టి, ఫేనీకరించగా వచ్చిన వైను, బీరు, ఏల్ వగైరాలని ఇంగ్లీషులో ఫెర్మెంటెడ్ లిక్కర్స్ (fermented liquors) అంటారు.

Kanguva Movie Review కoగువ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Kanguva Movie Review కoగువ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

బట్టీ పట్టగా వచ్చిన విష్కీ, బ్రాందీ, వాద్కా, కోన్యాక్ వంటి వాటిని “డిస్టిల్డ్ లిక్కర్స్ (distilled liquors) అంటారు. ఇలా వైనుని బట్టీ పట్టి బ్రాందీగా చేసే పద్ధతిని సంస్కృతంలో అభిషవం అంటారు. ఏ పేరు పెట్టి పిలచినా బట్టీ పట్టినప్పుడు పానీయంలో ఆల్కహాలు పాలు పెరుగుతుంది. ఒక పానీయంలో ఆల్కహాలు ఎన్ని పాళ్లు ఉందో చెప్పే సంఖ్యని ఇంగ్లీషులో “ప్రూఫ్” (proof) అంటారు.

వైనులో ఆల్కహాలు 15 శాతం ఉంటే ఆ వైను 30 ప్రూఫ్. ఆల్కహాలు 50 శాతం ఉన్న పానీయాలు 100 ప్రూఫ్. రసాయన పరిశోధనశాలలో వాడే “ఎతల్ ఆల్కహాలు”లో 95 శాతం పక్కా ఆల్కహాలే. అంటే అది 190 ప్రూఫ్ అన్న మాట. నూటికి నూరు పాళ్లూ ఆల్కహాలే ఉన్న ద్రవం 200 ప్రూఫ్. ఇది అపురూపమైనది. అతి విలువైనది. అరుదైనది. కల్తీ లేనిది.

సీసా బిరడా తీసేసరికి గాలి లోని చెమ్మదనం లోపలికి చేరి కల్తీ అయిపోతుంది.బట్టీ పట్టినప్పుడు ఆల్కహాలు ముందు మరిగిపోయి కావిరి రూపంలో “పైకి” పోతుంది. దానిని ఏ తోకబుడ్డిలోనో పట్టి, చల్లార్చినప్పుడు బ్రాందీ, విష్కీ వగైరాలు వస్తాయి. దిగమరిగించిన గిన్నెలో అడుగున మడ్డి (వెన్న కాచి నెయ్యి చేసినప్పుడు అడుగున మిగిలిన గోదావరి వంటి మడ్డి) మిగులుతుంది.

ఈ మడ్డిని “రిజ్వరట్రోల్” (resveratrol) అంటారు. ఇది తింటే వార్ధక్యం వచ్చే జోరు తగ్గి, యవ్వనపు రోజులు పెరుగుతాయని ఈ మధ్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ మన వేదాలలో ఉండే ఉంటాయి. అందుకనే సురా పానం చేసిన వారంతా దేవతలు అయేరేమో? పరిశోధించి చూడాలి.

ఎతల్ ఆల్కహాలుకి క్రిమి సంహారక లక్షణాలు ఉన్నాయి. దీనికి 140 ప్రూఫ్ ఆల్కహాలు వాడతారు. వైద్యుడు సూదిమందు ఇచ్చే ముందు ఈ రకం ఆల్కహాలులో దూదిని ముంచి, ఆ దూదితో జబ్బ మీద పులుముతాడు. ఆ తరువాతనే సూదితో పొడుస్తాడు. ఇలా చెయ్యడం వల్ల శరీరం మీద ఉన్న సూక్ష్మజీవులు సూదితోపాటు లోపలికి జొరబడకుండా జాగ్రత్త పడుతున్నామన్నమాట.

Devara on Netflix దేవర క్లైమాక్స్ ట్విస్ట్ రివిల్ అయింది
Devara on Netflix దేవర క్లైమాక్స్ ట్విస్ట్ రివిల్ అయింది

కల్తీ అంటే గుర్తుకి వస్తున్నాది. మన దేశంలో మద్యనిషేధం ఉన్న రోజులలో కల్తీ పడ్డ కల్లు తాగి కళ్లు పోగొట్టుకున్నవాళ్లూ, ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ ఉన్నారు. సారాని ఇలా కల్తీ చెయ్యడం చాల సులభం. మెతల్ ఆల్కహాలు చాల చవక. అందుకని పేరాశతో కొందరు దీనిని ఎతల్ ఆల్కహాలులో కలిపేసి అమ్మెస్తూ ఉంటారు.

స్వర్గపు అంచులు చవి చూద్దామనే సరదాలో చవకరకం సారాలు తాగెస్తే అంచుల వరకు ఏమి కర్మ, స్వర్గం లోగిట్లోకే వెళ్లిపోయే ప్రమాదం ఉంది.మోతాదు మించకుండా కల్తీ లేని ఆల్కహాలు తాగితే ఒక విధమైన ఆహ్లాదమూ, ఆనందమూ పుడతాయి. వెచ్చదనాన్నీ, ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మంచి చెడ్డల వ్యత్యాసాన్ని మరపింప చేస్తుంది ఆల్కహాలు ప్రభావం.

బాగుంది కదా అని బుడ్డిని మరికొంచెం పట్టిస్తే, ఇంద్రియాల మీద పటుత్వం తగ్గుతుంది. ఒంటి మీద స్పృహ సడలి, పేలాపన, తూలుడు మొదలవుతాయి. మద్యం పానీయాలు అన్నింటిలోనూ ఆల్కహాల్ ఉంటుంది, కానీ వాటి తయారీ విధానం, రుచి, వాసన, మరియు ఆల్కహాల్ శాతం వేర్వేరు. ఈ తేడాలు వాటిని ప్రత్యేకంగా నిలబెడతాయి.

Leave a Comment